logo

ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్‌

ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్‌పర్సన్‌)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్‌ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు.

Updated : 24 Apr 2024 04:49 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్‌పర్సన్‌)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్‌ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. ఇదే అంశంపై ఇద్దరు సీఓ (కమ్యూనిటీ ఆర్గనైజర్లు)లను, ఒక సోషల్‌ వర్కర్‌ను సస్పెండ్‌ చేశారు. ఆర్పీలు ఓటర్ల ఎపిక్‌ నెంబర్లు, ఆధార్‌కార్డులు, సెల్‌ఫోన్‌ నెంబర్లు సేకరించారన్న అభియోగాలపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఇచ్చిన నివేదికలో కేవలం ఎనిమిది మందిపైనే చర్యలు తీసుకోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తూర్పు నియోజకవర్గంలో ఏపీడీలు దగ్గరుండి 165 మంది ఆర్పీలకు ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున వైకాపా అభ్యర్థి నుంచి డబ్బులు ఇప్పించినట్లు ఆరోపణలున్నాయి.  వారంతా వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని చెబుతున్నారు. మరో పక్క ముగ్గురు ఆర్పీలు వైకాపా కండువాలు వేసుకుని తిరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థికి అత్యంత సన్నిహితుడైన ఓ వైకాపా నాయకుడు చెప్పినట్లు ఆర్పీలు నడుచుకుంటున్నా జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు