logo

ఎంటీఎస్‌ ఉపాధ్యాయులకు తొలగింపు ఉత్తర్వులు

ఎంటీఎస్‌ (మినిమం టైం స్కేల్‌) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్‌ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 24 Apr 2024 02:38 IST

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ఎంటీఎస్‌ (మినిమం టైం స్కేల్‌) ప్రాతిపదికన పనిచేస్తున్న డీఎస్సీ-98, 2008 ఉపాధ్యాయులను తొలగిస్తూ జిల్లా నోడల్‌ విద్యాశాఖాధికారి చంద్రకళ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నంతోపాటు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో ఉన్న అభ్యర్థులకు 2023-24 విద్యా సంవత్సరంలో 11 నెలలు పనిచేసేలా గతేడాది జూన్‌ 24వ తేదీన నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు జిల్లాల్లో సుమారు 400 మంది ఎంటీఎస్‌ ఎస్జీటీలుగా పనిచేస్తున్నారు. టెర్మినేషన్‌ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్‌ 30 వరకు వీరు విధుల్లో కొనసాగనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభంలో వీరి సేవలను ప్రభుత్వం మళ్లీ వినియోగించుకోనుంది. ఏటా 11 నెలల పాటు కొనసాగించి వేసవి సెలవుల్లో తమని విధుల నుంచి తప్పించడం బాధాకరమని, శాశ్వత ఉపాధ్యాయులుగా పరిగణించాలని ఎంటీఎస్‌ ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని