logo

‘క్లీనింగ్‌ రోబో’ వచ్చేసింది

నగరపాలక సంస్థకు సరికొత్త ‘క్లీనింగ్‌ రోబో’ అందుబాటులోకి వచ్చింది. బాండిక్యుట్‌(వి.2.0).. అనిపిలిచే దీనిని ఏ తరహా మ్యాన్‌హోల్స్‌నైనా చాలా తేలిగ్గా శుభ్రం

Updated : 27 May 2022 05:55 IST

రోబోతో నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, అధికారులు, ఓఎన్‌జీసీ సంస్థ ప్రతినిధులు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థకు సరికొత్త ‘క్లీనింగ్‌ రోబో’ అందుబాటులోకి వచ్చింది. బాండిక్యుట్‌(వి.2.0).. అనిపిలిచే దీనిని ఏ తరహా మ్యాన్‌హోల్స్‌నైనా చాలా తేలిగ్గా శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా భూగర్భ డ్రెయినేజీ మ్యాన్‌హోల్స్‌లో పేరుకుపోయిన పూడికలను తొలగించడం, వాటిని శుభ్రం చేయడం దీని ప్రత్యేకత. దీనికి అనుబంధంగా ఉండే ‘డ్రోన్‌ యూనిట్‌’కు ప్రత్యేకంగా కెమెరాలను అమర్చుతారు. వాటి సాయంతో ఈ రోబో గొట్టాల్లో మురుగునీటి ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో ముందుస్తు అంచనా వేస్తుంది. మరోవైపు మురుగునీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నవాటిని, ఇతర ఆటంకాలను కచ్చితంగా గుర్తిస్తుంది. ఫలితంగా వాటిని సాంకేతిక సాయంతో సక్రమంగా తొలగించేందుకు సాయపడుతుంది. ఇక గొట్టాలు, మ్యాన్‌హోల్స్‌ లోపల రోజులు నిల్వ ఉండే మానవ విసర్జిత వ్యర్థాలవల్ల వెలువడే విషవాయువుల పరిమాణాలను సకాలంలో గుర్తించి వాటి ప్రమాదకర స్థితిని అంచనా వేసి, తొలగింపు విధుల్లోని సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. రూ.39.53 లక్షల విలువైన ఈ క్లీనింగ్‌ రోబోను కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబులిటీ కింద ఓఎన్‌జీసీ(ఆయిల్‌, నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) న్యూదిల్లీ సంస్థ.. విజయవాడ నగరపాలక సంస్థకు ప్రస్తుతం ఉచితంగా అందజేసింది.

ప్రారంభించిన కమిషనర్‌

ఓఎన్‌జీసీ సంస్థ తమ సామాజిక బాధ్యతగా నగరపాలక సంస్థకు అందించిన మ్యాన్‌హోల్స్‌ క్లీనింగ్‌(రోబో) యంత్రాన్ని కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌.. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమిత్‌ నారాయణ్‌తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమాన్‌పేట వాహన డిపోలో క్లీనింగ్‌ రోబో తాళాన్ని స్వీకరించారు. ఉప మేయర్‌ శ్రీశైలజారెడ్డి, కార్పొరేటర్‌ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని