logo

సైబర్‌ నేరాలపై అవగాహన అవసరం

అధికారులంతా సైబర్‌ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇన్‌ఛార్జి అడ్మిన్‌ డీసీపీ పి.వెంకటరత్నం సూచించారు. మంగళవారం ఆమె పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు,

Published : 17 Aug 2022 04:59 IST

అధికారులకు సూచనలు చేస్తున్న ఇన్‌ఛార్జి అడ్మిన్‌ డీసీపీ పి.వెంకటరత్నం

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : అధికారులంతా సైబర్‌ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇన్‌ఛార్జి అడ్మిన్‌ డీసీపీ పి.వెంకటరత్నం సూచించారు. మంగళవారం ఆమె పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, స్టేషన్‌ రైటర్లు, కంప్యూటర్‌ సిబ్బందికి సైబర్‌ నేరాల దర్యాప్తుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆన్‌లైన్‌ మోసాలు, ఆర్థిక నేరాలు, లోన్‌ యాప్స్‌, ఓటీపీ, ఈకేవైసీ, హనీట్రాప్‌, జాబ్‌ స్కామ్స్‌, ఫోన్‌కాల్‌ ఫ్రాడ్స్‌, సామాజిక మాధ్యమాల నకిలీ ఖాతాలు, ప్రకటన మోసాలు, ఛైల్డ్‌ ఫోర్నోగ్రఫీ తదితర సైబర్‌ నేరాలపై ఐటీ కోర్‌, సైబర్‌ క్రైం అధికారుల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తు, ఐటీ యాక్ట్‌ చట్టాల గురించి తెలుసుకోవాలని చెప్పారు. సైబర్‌నేరాల్లో కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల్లో ప్రధానంగా యువతలో అవగాహన కలిగించాలని సూచించారు. సైబర్‌ హెల్ప్‌ లైన్‌ 1930 నెంబరు ప్రాధాన్యత, దాని ద్వారా ఎలాంటి సాయం పొందవచ్చో ప్రజలకు తెలియజేసి, చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. సైబర్‌ నేరం జరిగినట్లు గుర్తించిన వెంటనే 1930కు ఫోన్‌ చేయాలన్నారు. రూ.15వేలు అంతకంటే ఎక్కువ సొమ్ము నష్టపోతే.. బాధితుడు 48 గంటల్లోపు 1930కు సమాచారం అందిస్తే నిందితుడి ఖాతాను స్తంభింపచేస్తారని వెంకటరత్నం వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని