logo

సీఎస్‌ తీరు గర్హనీయం

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి అనుసరించిన తీరు గర్హనీయమని మాజీమంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు.

Published : 05 Feb 2023 05:33 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర

మచిలీపట్నం(కోనేరుసెంటర్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి అనుసరించిన తీరు గర్హనీయమని మాజీమంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణకు హాజరైన వారిని స్వయంగా సీఎస్‌ తన కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. కొందరు ఉన్నతాధికారులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని, అందుకు తగ్గ మూల్యం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, ఆయన సతీమణి సహాయకులను ప్రశ్నించిన సీబీఐ తర్వాత టార్గెట్‌ ఎవరనే విషయంలో తాడేపల్లి ప్యాలెస్‌లో ఆందోళన నెలకొందన్నారు. సీబీఐ దర్యాప్తులో వెలుగు చూస్తున్న నిజాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు నారా లోకేష్‌ పాదయాత్రకు సంబంధించిన ప్రచార వాహనాలను సీజ్‌ చేశారన్నారు. ఏ చట్టం ప్రకారం వాహనాలు సీజ్‌ చేశారో పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని