logo

మోపిదేవి దేవస్థాన ఆదాయం రూ.9.53 లక్షలు

శ్రీపంచమి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఒక్క రోజే రూ.9.53 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ నల్లం సూర్య చక్రధరరావు పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 05:06 IST

దర్శనానికి బారులు తీరిన భక్తులు

మోపిదేవి, న్యూస్‌టుడే: శ్రీపంచమి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఒక్క రోజే రూ.9.53 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ నల్లం సూర్య చక్రధరరావు పేర్కొన్నారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. 227 మంది మహన్యాస ఏక రుద్రాభిషేకాలు చేయించారు. శాంతి కల్యాణోత్సవం 100, రాహు, కేతు, కాలసర్పదోష పూజల్లో 258, సాధారణ అభిషేకాలు 338, తలనీలాలు అత్యధికంగా 717, పాలపొంగళ్లు 201, శీఘ్ర దర్శనానికి 1141 మంది పాల్గొన్నారు. ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.7.75 లక్షలు, శాశ్వత అన్నదానం రూ.20 వేలు, నిత్యాన్నదానానికి రూ.81 వేలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1.41 లక్షల ఆదాయం సమకూరిందని వివరించారు.

నేడు కానుకల లెక్కింపు: సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను సోమవారం లెక్కిస్తామని ఆలయ సహాయ కమిషనర్‌ ఎన్‌.సూర్య చక్రధరరావు ఆదివారం తెలిపారు. ఆసక్తి గల భక్తులు సంప్రదాయ దుస్తులతో పాల్గొనాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని