logo

కూటమిని గెలిపించండి

పెదకళ్లేపల్లిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా బాలశౌరి, ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్‌లను గెలిపించాలని కోరారు.

Published : 28 Apr 2024 03:20 IST

అవనిగడ్డ, మోపిదేవి, ఘంటసాల, చల్లపల్లి, న్యూస్‌టుడే: పెదకళ్లేపల్లిలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా బాలశౌరి, ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్‌లను గెలిపించాలని కోరారు.

తెదేపా ఆధ్వర్యంలో తాడేపల్లి, వేములపల్లి గ్రామాల్లో బాబు స్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. మండలి బుద్ధప్రసాద్‌ పెద్ద కుమార్తె కృష్ణప్రభ, జడ్పీటీసీ సభ్యురాలు తుమ్మల వరలక్ష్మి, తెదేపా నాయకులు ఇంటింటికీ వెళ్లి సూపర్‌ - 6 కరపత్రాలు పంపిణీ చేశారు.

చినగుడుమోటు, నక్క వానిదారి గ్రామాల్లో మండలి బుద్ధప్రసాద్‌ కోడలు సాయి సుప్రియ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

జనసేనలో చేరికలు : వైకాపా నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డకు చెందిన ఆర్య వైశ్య ప్రముఖడు మానేపల్లి రాజేంద్రవర ప్రసాద్‌, ఉత్తర చిరువోలులంక గ్రామ కన్వీనర్‌ నడకుదిటి ప్రసాద్‌, విశ్వనాథపల్లి సర్పంచి ప్రధాన అనుచరులు కొప్పనాతి రాంబాబు, కొప్పనాతి దుర్గారావు, కోడూరు మండలం మందపాకల వైకాపా గ్రామ కన్వీనర్‌ గాదె వెంకటేశ్వరరావు సన్నిహితుల జనసేనలో చేరారు. పుల్లయ్యగారి దిబ్బ, పెద్ద గౌడపాలెం, గణపేశ్వరం, గ్రామాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు జనసేనలో చేరాయి. వారికి బుద్ధప్రసాద్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన రాష్ర కార్యదర్శి మండలి రాజేష్‌, శేషుబాబు, గాజుల మురళీకృష్ణ, మండలి వెంకట్రామ్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని