logo

కూటమిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వేటు తప్పదు

గన్నవరానికి చెందిన నలుగురు భాజపా నాయకులు తెదేపా, భాజపా, జనసేన పొత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు బుధవారం తెలిపారు.

Published : 09 May 2024 04:08 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరానికి చెందిన నలుగురు భాజపా నాయకులు తెదేపా, భాజపా, జనసేన పొత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు బుధవారం తెలిపారు. నాయకులు ఎస్‌.విజయదుర్గ, జె.రవికుమార్‌, కొర్రపోలు శ్రీనివాసరావు, ఎమ్‌.సతీష్‌ కుమార్‌లు పార్టీ పొత్తుపై, పార్టీ రాష్ట్ర అధ్యక్షులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంతో వారి ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసి పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామన్నారు. పార్టీ నిర్ణయాలను అగౌరవ పరిచే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని శ్రీరాజబాబు హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని