logo

ఘంటసాల గానం.. అజరామరం

గాన గంధర్వుడు ఘంటసాల గానం అజరామరం. ఆయన ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కలెక్టర్‌ నాగలక్ష్మి కొనియాడారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర్‌రావు శతజయంతి ఉత్సవాలను ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో

Published : 05 Dec 2021 04:48 IST

నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: గాన గంధర్వుడు ఘంటసాల గానం అజరామరం. ఆయన ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కలెక్టర్‌ నాగలక్ష్మి కొనియాడారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర్‌రావు శతజయంతి ఉత్సవాలను ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్సు హాలులో నిర్వహించారు. విశ్రాంత తహసీల్దార్‌ పాల సముద్రం నాగరాజు బృందం, శ్యామ్‌సుందర్‌శాస్త్రి ఆలపించిన ఘంటసాల పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జేసీ గంగాధర్‌గౌడ్‌, డీఆర్‌ఓ గాయత్రీదేవి, పర్యాటక శాఖ ఆర్డీ రామచంద్ర, డైరెక్టర్‌ జాహ్నవి, జిల్లా అధికారి నాగేశ్వర్‌, జిల్లా మేనేజర్‌ దీపక్‌, సమాచార శాఖ ఏడీ వేలాయుధం, ఇంజినీరింగ్‌శాఖ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని