logo

పరిష్కారం కోసం పదేపదే వినతి

స్థానికంగా సమస్యలు పరిష్కరించకపోవడంతో పదేపదే అర్జీలు పట్టుకుని బాధితులు స్పందన కార్యక్రమానికి వస్తూనే ఉన్నారు. అర్జీలు ఇస్తూనే ఉన్నారు. ఏప్రిల్‌ 11వ తేదీ నుంచి నేటికీ పలువురు ఎస్పీ కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నారంటే క్షేత్ర స్థాయిలో

Published : 24 May 2022 06:00 IST

జిల్లా ఏఎస్పీ రామకృష్ణప్రసాద్‌ వద్ద

మొర పెట్టుకుంటున్న వృద్ధు.రాలు, దివ్యాంగురాలు

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే : స్థానికంగా సమస్యలు పరిష్కరించకపోవడంతో పదేపదే అర్జీలు పట్టుకుని బాధితులు స్పందన కార్యక్రమానికి వస్తూనే ఉన్నారు. అర్జీలు ఇస్తూనే ఉన్నారు. ఏప్రిల్‌ 11వ తేదీ నుంచి నేటికీ పలువురు ఎస్పీ కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నారంటే క్షేత్ర స్థాయిలో అర్జీలు పరిష్కరించడం లేదని అర్థమవుతోంది. స్థానికంగా వారికి న్యాయం జరక్క తిరిగి ఎస్పీని ఆశ్రయిస్తున్నారు. కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన నరసింహులు దంపతులు తప్పిపోయిన తమ కుమార్తె ఆచూకీ తెలపాలంటూ సోమవారం ఎస్పీని మరోసారి కలిసి న్యాయం చేయాలని కోరింది. ధర్మవరానికి చెందిన వృద్ధురాలు నరసమ్మ ఇప్పటికే అనంతపురంలో ఇవ్వగా జిల్లా ఏర్పాటయ్యాక స్పందనలో ప్రతి సోమవారం వచ్చి అర్జీ ఇస్తోంది. నమ్మించి మోసం చేసి తనతో రూ.2.75 లక్షలు ప్రవీణ్‌ అనే దుకాణాదారుడు కాజేశాడని ఏడాదిగా తిరుగుతున్నా.. కాటికి వెళ్లకనే కాసులు ఇప్పించి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది. ఇలా చాలా మంది స్థానికంగా తమ సమస్యకు పరిష్కారం దొరక్క ఎస్పీ వద్ద చెప్పుకొంటే న్యాయం జరుగుతుందని ఆశతో వస్తున్నారు. సోమవారం నాటి స్పందనలో అదనపు ఎస్పీ రామకృష్ణప్రసాద్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 47 అర్జీలు వచ్చాయని తెలిపారు. ఎస్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని