logo

పాఠశాలలకు ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాల విద్యావిభాగం ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పాఠశాలకు ఉపాధ్యాయులు వెళ్లారు. వేసవి సెలవులు జులై 4న ముగుస్తాయి. 5 నుంచి తరగతులు పునః

Published : 29 Jun 2022 05:40 IST

కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరమ్మతులు చేయిస్తున్న ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాల విద్యావిభాగం ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పాఠశాలకు ఉపాధ్యాయులు వెళ్లారు. వేసవి సెలవులు జులై 4న ముగుస్తాయి. 5 నుంచి తరగతులు పునః ప్రారంభం కానున్నాయి. అయితే విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఉపాధ్యాయులు 28 నుంచే పాఠశాలలకు హాజరయ్యారు. జులై 5వ తేదీ వరకూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు రోజువారీ కార్యక్రమాలు సూచించారు. 28న పాఠశాలల్లో శుభ్రత కార్యక్రమాలు, అవసరమైన మరమ్మతులు చేయించాలి. 29న గ్రామ, వార్డు సచివాలయ, స్త్రీ, శిశుసంక్షేమ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ తదితర అధికారులతో కలసి తల్లిదండ్రుల కమిటీతో సమావేశాలు నిర్వహించాలి. తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయించాలి. 30న బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలల్లో చేర్చాలి. 1న ప్రయోగశాలలు క్రియాత్మకంగా ఉండేలా చూసుకోవాలి. రికార్డులు, రిజిస్ట్రర్లు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించాలి. 2న విద్యార్థుల భద్రత, జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్ధారించాలి. జగనన్న కిట్లు పాఠశాల పాయింట్‌ వద్ద అందిందని నిర్ధారించాలి. ప్రవేశాలకు రికార్డుషీట్లు, టీసీలు జారీ చేయాలి. 3న సూచించిన అంశాలు, పూర్తికాని కార్యకలాపాలు పూర్తి చేయాలి. 4న మధ్యాహ్న భోజనం నిర్వహణకు వంటపాత్రలు శుభ్రం చేయించాలి. 5న పండగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని