logo

వాతావరణ సమతుల్యతకు కృషి

పర్యావరణం కలుషితమవకుండా, వాతావరణం సమతుల్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాంతిస్వరూప్‌భట్నాగర్‌ అవార్డు గ్రహీత, కోల్‌కతాకు చెందిన ఆచార్యులు సౌమిత్రో బెనర్జీ పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 03:09 IST

ప్రసంగిస్తున్న ఆచార్య సౌమిత్రోబెనర్జీ

అనంతపురం విద్య: పర్యావరణం కలుషితమవకుండా, వాతావరణం సమతుల్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శాంతిస్వరూప్‌భట్నాగర్‌ అవార్డు గ్రహీత, కోల్‌కతాకు చెందిన ఆచార్యులు సౌమిత్రో బెనర్జీ పేర్కొన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించే ఉద్దేశంతో బ్రేక్‌త్రూ సైన్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం ఆర్ట్స్‌ కళాశాల డ్రామాహాల్లో సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సౌమిత్రో బెనర్జీ మాట్లాడుతూ పర్యావరణంలో మార్పులకు మానవ కార్యకలాపాలే కారణమన్నారు. గ్రీన్‌హౌస్‌ వాయువులతో అతి తక్కువకాలంలో ఉష్ణోగ్రత పెరుగుతోందన్నారు. వైద్య కళాశాల సహాయాచార్యులు ఆశాలత మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో విచ్చలవిడిగా యాంటిబయోటిక్స్‌ వాడకంతో కొన్ని వ్యాధులు అరికట్టడానికి సాధ్యం కావడంలేదన్నారు. బీఎస్‌ఎస్‌ రాష్ట్ర బాధ్యుడు తబ్రేజ్‌, గంగాధర్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని