logo

బ్రాహ్మణ పేద బాలికల ఉపకార వేతనాలు

బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఉమ్మడి జిల్లాలోని పేద బ్రాహ్మణ విద్యార్థినుల ఉపకార వేతనాల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంఘం కార్యదర్శి రమాదేవి తెలిపారు.

Updated : 04 Jun 2023 06:35 IST

నిరసన తెలుపుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

తపోవనం (అనంత గ్రామీణం): బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం తరఫున ఉమ్మడి జిల్లాలోని పేద బ్రాహ్మణ విద్యార్థినుల ఉపకార వేతనాల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంఘం కార్యదర్శి రమాదేవి తెలిపారు. ఆరో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న పేద బ్రాహ్మణ బాలికలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.  ఇతర వివరాలకు 97037-89201, 94901-30999 చరవాణి నెంబర్లలో సంప్రదించాలని కోరారు.


ఎస్‌ఆర్‌ఐటీ గుర్తింపురద్దు చేయాలని ఆందోళన

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: విద్యార్థుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుడుతున్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ధనంజయనాయుడు డిమాండ్‌ చేశారు. శనివారం కళాశాల ఎదుట భైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల నుంచి రూ.లక్షలు ఫీజులు వసూలు చేస్తూ.. నాసిరకం ఆహారం అందించడం దారుణమన్నారు. 86 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురైతే జిల్లా అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే పద్మావతి, ప్రభుత్వ సలహాదారు సాంబశివారెడ్డి దంపతులు స్వయంగా కళాశాలను నిర్వహిస్తున్నారన్నారు. వారి పార్టీ అధికారంలో ఉన్నందునే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బుక్కరాయసముద్రం పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్ట్‌ చేసి స్టేషనుకు తరలించారు. విషయం తెలుసుకున్న తెదేపా ద్విసభ్యకమిటీ సభ్యులు నరసానాయుడు, కేశవరెడ్డి, రామలింగారెడ్డి తదితరులు పోలీసుస్టేషనుకు చేరుకుని నాయకులను పరామర్శించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా, న్యాయం చేయాలని కోరుతున్న వారిని అరెస్టు చేయడం తగదన్నారు. కార్యక్రమంలో లక్ష్మీనరసింహయాదవ్‌, పరశురాం, సురేష్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


నేడు పరిటాల రవీంద్ర స్మారక క్రికెట్ ఫైనల్‌

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: పరిటాల రవీంద్ర స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ ఫైనల్‌ పోటీ నిర్వహించనున్నట్లు పర్యవేక్షకుడు నాగరాజు పేర్కొన్నారు. 20 రోజులుగా మండలంలోని ఎన్‌ఎస్‌గేట్ సమీపంలో ఆర్డీఎస్‌ఎల్‌ క్రికెట్ లీగ్‌ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. బసినేపల్లి, మేడాపురం జట్ల మధ్య ఉందయం 9 గంటలకు ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుందన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కార్యక్రమానికి హాజరై బహుమతులు ప్రదానం చేస్తారని వివరించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని