logo

సైబర్‌ పోలీసుల అదుపులో చిలమత్తూరు యువకుడు

హైదరాబాద్‌ సైబర్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు బుధవారం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సంజీవరాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

Published : 28 Mar 2024 04:44 IST

చిలమత్తూరు: హైదరాబాద్‌ సైబర్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు బుధవారం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సంజీవరాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులకు సంబంధించి ఫ్రాడ్‌ ఫోన్‌కాల్స్‌ ఖాతాదారులకు చేసి వారి వద్ద నుంచి ఓటీపీ తెలుసుకొని వారి ఖాతాల్లోని నగదును విత్‌డ్రా చేస్తారు. ఇలా రూ.21 లక్షలకు సంబంధించి వివిధ ఖాతాదారుల నుంచి నగదు విత్‌డ్రా చేశారని సైబర్‌ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏ సిమ్‌కార్డు నుంచి ఇలాంటి మెసేజ్‌లు వెళ్లాయి.. అది ఎవరి పేరుమీద ఉంది.. ఏ మండలం అనే విషయాలను హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు ఆరా తీశారు. అది శ్రీకాంత్‌రెడ్డి పేరు మీద ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని