logo

ఉన్నది అభివృద్ధికి దూరం..కొత్తది నిరుపయోగం

అనంతపురం నగరంలో పాతూరు కూరగాయల మార్కెట్‌ ఎప్పటి నుంచో అభివృద్ధికి దూరంగా ఉంది. ఇప్పటికి ఇక్కడ వ్యాపారులకు, వినియోగదారులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎండకు, వానకు పరదాలే రక్షణగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి.

Published : 17 Apr 2024 05:46 IST

ఆదిమూర్తినగర్‌ రైతుబజార్‌లో సౌకర్యాలు ఉన్నా వృథాగా..

అనంతపురం నగరంలో పాతూరు కూరగాయల మార్కెట్‌ ఎప్పటి నుంచో అభివృద్ధికి దూరంగా ఉంది. ఇప్పటికి ఇక్కడ వ్యాపారులకు, వినియోగదారులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఎండకు, వానకు పరదాలే రక్షణగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి. దీని అభివృద్ధి కోసం మున్సిపాలిటీ, ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో ఇప్పటికీ అధ్వాన స్థితిలోనే ఉంది. ఈ వెతలు తీర్చటానికి  రైతులకు, వ్యాపారులకు వినియోగదారులకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉండే విధంగా ఆదిమూర్తి నగర్‌లో రైతు బజార్‌ను ఏర్పాటు చేసినా అక్కడికి తరలించే ప్రయత్నం చేయలేదు. దీంతో కొన్నేళ్లుగా రైతుబజార్‌ ఉన్నా ఉపయోగం సున్నా అన్నట్టు మారింది. అటు ఎక్కువగా వ్యాపారాలు జరిగే పాతూరు మార్కెట్‌ ప్రాంతంపై చిత్తశుద్ధి లేకపోవడంతో   ప్రజలకు కష్టాలు తప్పలేదు.     

  - ఈనాడు, అనంతపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని