logo

నేత్రపర్వం.. సీతారాముల తిరుకల్యాణోత్సవం

కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది.

Published : 18 Apr 2024 04:18 IST

ప్రత్యేక అలంకరణలో సీతారాములు

గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే : కసాపురంలోని శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల తిరుకల్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. బుధవారం వేకువజామున ఆంజనేయస్వామి వారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. స్వామి స్వర్ణ, వజ్రకవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో సీతారామల ఉత్సవమూర్తులను వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి తిరుకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి గజ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వై.భద్రాజీ, ఏఈవో మల్లికార్జున, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్‌పర్సన్‌ సుగుణమ్మ, ఆలయ ప్రధాన అర్చకుడు గరుడాచార్యులు, వేదపండితుడు రామకృష్ణ అవధాని, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తిరుకల్యాణోత్సవంలో భక్తులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని