logo

దోచుకొని.. దాచుకోవడానికే వచ్చిన వలస పక్షులు

కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి వైకాపా హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ, బెంగళూరు/కళ్యాణదుర్గం నుంచి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉషశ్రీచరణ్‌ అనే వలస పక్షులు ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ఎలాగైనా గెలుపొంది ప్రకృతి వనరులను దోచుకొని..

Published : 10 May 2024 03:46 IST

సోమందేపల్లి, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి వైకాపా హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ, బెంగళూరు/కళ్యాణదుర్గం నుంచి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉషశ్రీచరణ్‌ అనే వలస పక్షులు ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ఎలాగైనా గెలుపొంది ప్రకృతి వనరులను దోచుకొని.. దాచుకోవడానికి వచ్చాయని ప్రజలంతా ఆలోచించి తెదేపాకు ఓటేయాలని తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బీకే పార్థసారథి, సవిత కోరారు. గురువారం సాయంత్రం వారు సోమందేపల్లిలో రోడ్‌షో నిర్వహించారు. నాయకులు చంద్రశేఖర్‌, వెంకటరమణ, సిద్ధలింగప్ప, సూరి, మద్దిలేటి, చంద్రశేఖర్‌, క్రిష్టప్ప, నాగప్ప పాల్గొన్నారు.     


గోరంట్లను అభివృద్ధి చేస్తాం

గోరంట్ల : గోరంట్ల మండలాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని బీకే పార్థసారథి, సవిత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా భాజపా జిల్లా అధ్యక్షుడు జీఎంశేఖర్‌తో కలిసి గోరంట్లలో గురువారం పెద్దఎత్తున రోడ్డుషో కార్యక్రమం నిర్వహించారు. రూ.320 కోట్లతో అన్ని చెరువులకు నీరు నింపడంతో పాటు గొల్లపల్లి జలాశయం నుంచి తాగునీటిని తీసుకొస్తామన్నారు.


వైకాపా ఎంపీటీసీ సభ్యుడు తెదేపాలో చేరిక

రొద్దం: పెనుకొండ నియోజకవర్గంలో తెదేపాలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. గురువారం రొద్దం మండలంలోని కంబాలపల్లి పంచాయతీలోని శ్యాపురం గ్రామానికి చెందిన వైకాపా ఎంపీటీసీ సభ్యుడు రమేశ్‌తో పాటు 17 కుటుంబాల సభ్యులు తెదేపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని