logo

ఓటరు స్లిప్పుల మాటున నగదు పంపిణీ

పట్టణంలోని 11వ వార్డులో ఓటరు స్లిప్పుల మాటున నగదు పంపిణీ చేస్తున్న వైకాపా కార్యకర్తలకు స్థానికుల నుంచి ఊహించని రీతిలో తిరుగుబాటు ఎదురైంది.

Published : 10 May 2024 03:51 IST

కదిరిలో ఎదురుతిరిగిన స్థానికులు

కదిరి పట్టణం: పట్టణంలోని 11వ వార్డులో ఓటరు స్లిప్పుల మాటున నగదు పంపిణీ చేస్తున్న వైకాపా కార్యకర్తలకు స్థానికుల నుంచి ఊహించని రీతిలో తిరుగుబాటు ఎదురైంది. గురువారం స్థానిక వైకాపా నాయకుడి భార్య, వైకాపా యువజన విభాగం నాయకుడు, మరికొందరు 11వ వార్డులో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ నగదు పంపిణీ చేపట్టారు. పురుషులు స్లిప్పులు పంపిణీ చేస్తే మహిళలు హ్యాండ్‌బ్యాగుల నుంచి నగదుతీసి ఓటర్లకు అందజేస్తూ ప్రలోభానికి గురిచేసేందుకు యత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు వైకాపా కార్యకర్తలను అడ్డుకున్నారు. ఐదేళ్లుగా కనిపించని జనం ఎన్నికల వేళ గుర్తుకొచ్చారా అంటూ ఎదురుతిరిగారు. మీ డబ్బులు వద్దు.. మీరు ఇచ్చే ఓటరు స్లిఫ్పులూ అక్కర్లేదంటూ చుట్టుముట్టారు. ఆగ్రహంతో ఊగిపోయారు. స్థానికుల నుంచి ఊహించని రీతిలో వ్యతిరేకత రావడంతో అరవద్దండంటూ వైకాపా నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. నగదు పంపిణీ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రతిపక్షపార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని