logo

వైకాపాను ఓటుతో తరిమివేయాలి: కాలవ

నవరత్నాల పేరుతో సామాన్య ప్రజలను నట్టేట ముంచి ఐదేళ్లపాటు నయవంచక పాలన సాగించిన జగన్‌ను ఓటుతో తరిమి వేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

Published : 10 May 2024 03:54 IST

బొమ్మనహాళ్‌, న్యూస్‌టుడే: నవరత్నాల పేరుతో సామాన్య ప్రజలను నట్టేట ముంచి ఐదేళ్లపాటు నయవంచక పాలన సాగించిన జగన్‌ను ఓటుతో తరిమి వేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో ధర్మాన్ని గెలిపించే బాధ్యత ఓటర్లపై ఉందన్నారు. భూ కుంభ కోణాలు చేసేందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును తీసుకు వచ్చారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా తెదేపా సీనియర్‌ నాయకులు ఆర్‌.చంద్రహాస్‌, కేశవరెడ్డి, మండల కన్వీనర్‌ బలరామిరెడ్డి, నాయకులు కొత్తపల్లి మల్లికార్జున, మల్లికార్జున, తిమ్మరాజు, సప్తగిరి, సత్యనారాయణ, పయ్యావుల అనిల్‌, కాంతారావు, ముల్లంగి నారాయణస్వామి, అప్పారావు, పయ్యావుల మోహన్‌బాబు, ప్రేమకుమార్‌, ఎంఆర్‌సీ మల్లన్న, దిలీప్‌, భాజపా నాయకులు హీరోజీరావు, అంజి, జనసేన నాయకులు మంజునాథ్‌గౌడ్‌, సికిందర్‌బాషా, శివరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని