logo

జానెడు రోడ్డేయలేని ఎమ్మెల్యే అవసరమా?: సునీత

వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి పరాజయం తప్పదు. వైసీపీ నాయకులు తెదేపాలోకి కొనసాగుతున్న వలసలే ఓటమికి సంకేతమని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు.

Updated : 10 May 2024 05:50 IST

అనంతపురం (కళ్యాణదుర్గం రోడ్డు), రాప్తాడు, న్యూస్‌టుడే: వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి పరాజయం తప్పదు. వైసీపీ నాయకులు తెదేపాలోకి కొనసాగుతున్న వలసలే ఓటమికి సంకేతమని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. గురువారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో 85 కుటుంబాలు పార్టీలోకి చేరారు. వారందరికీ తెదేపా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారిలో చెన్నేకొత్తపల్లి మండలం యర్రంపల్లి, నరసింగరాయునిపల్లి, చిన్నమొగలాయిపల్లి, న్యామద్దల గ్రామాల నుంచి 30 కుటుంబాలు పరిటాల సునీత సమక్షంలో చేరారు. కనగానపల్లి మండలం దాదులూరు, ఆత్మకూరు మండలం గొరిదిండ్ల, వి.డి.తాండ, సిద్ధరాంపురం, బి.యాలేరు, తలుపూరు గ్రామాల నుంచి 45 కుటుంబాలు పరిటాల శ్రీరామ్‌ సమక్షంలో పార్టీలో చేరగా, అనంతపురం గ్రామీణం సిండికేట్‌నగర్‌, కొడిమి గ్రామాల నుంచి 10 కుటుంబాలు పరిటాల సిద్ధార్థ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం సునీత మాట్లాడుతూ ఎన్నికల చివరి రోజు వరకు తెదేపాలోకి వలసలు ఆగడం లేదని, ఎవరైనా వైకాపా నాయకులు పార్టీలోకి రావాలంటే రావచ్చన్నారు. ఇక మీరు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, మీకు అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.

నీ ఈ ఐదేళ్లలో ఒక్క చెరువుకూ నీరు ఇవ్వకుండా జానెడు రోడ్డు వేయకుండా పాలన సాగించిన ప్రకాశ్‌రెడ్డిని వైకాపా నాయకులే చొక్కా పట్టుకుని నిలదీయాలని సునీత వ్యాఖ్యానించారు. ఆకుతోటపల్లి ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. మీ చెరువులకు నీరు ఇచ్చాడా, జానెడు రోడ్డు వేశాడా? మీరే ఆలోచించుకోవాలన్నారు. తెదేపా కార్యకర్తలు ఎవరూ ఆవేశాలకు లోను కావద్దని దృష్టి అంతా ఎన్నికలపైనే ఉండాలన్నారు. జూన్‌ 4న ఎవరు తొడలు కొడతారో ఎవరు మీసాలు తిప్పుతారో చూస్తారన్నారు. ఆకుతోటపల్లికి చెందిన వైకాపా నాయకులు మాజీ పంచాయతీ సర్పంచ్‌ బిరక పెదయ్య, చిదగొండ శేషు, మాజీ డీలర్‌ చిట్ర సంగయ్య, చిట్ర సూరి, అన్నగిరి ఈశ్వరయ్య, మలిశెట్టి ఈశ్వరయ్య, చిట్ర ఆదినారాయణ, వెన్నుపూస విజయ్‌కుమార్‌, స్థానిక గ్రామ నాయకుల ఆధ్వర్యంలో సునీత సమక్షంలో తెదేపాలోకి చేరారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని