logo

తుస్సుమన్న జగన్‌ సభ

కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో, బహిరంగ సభ తుస్సుమంది.

Published : 10 May 2024 04:07 IST

సీఎం మాట్లాడక ముందే వెనుదిరిగిన జనం

కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గం గ్రామీణం, కుందుర్పి, కంబదూరు, న్యూస్‌టుడే: కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో, బహిరంగ సభ తుస్సుమంది. జగన్‌ హెలీకాఫ్టర్‌ దిగి కాన్వాయ్‌లో వస్తుండగా పరుగులు తీసుకుంటూ వచ్చిన జనం.. ఆయన మాట్లాడటం మొదలు పెట్టగానే వెనుదిరిగారు. మధ్యాహ్నం 1గంటకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హెలీకాఫ్టర్‌లో కళ్యాణదుర్గం చేరుకున్నారు. రోడ్డుషో వద్ద అంత వరకు జనం కనిపించలేదు. కాన్వాయ్‌ వస్తుండగా జనం వచ్చారు. ఎండ వేడికి తట్టుకోలేక వచ్చిన దారి వెంటే మళ్లీ వెనక్కు వచ్చి వాహనాలు ఎక్కి వెళ్లిపోయారు.

రహదారుల దిగ్బంధంతో అష్టకష్టాలు

ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో ఉదయం 11గంటలకే కళ్యాణదుర్గం పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. అనంతపురం వెళ్లే బస్సులను బైపాస్‌ మీదకు మళ్లించారు. బస్సులను కంబదూరు, ధర్మవరం బైపాస్‌ల వద్దే నిలిపివేశారు. ప్రయాణికులు కిలోమీటరు మేర పట్టణంలోకి నడుచుకుంటూ వచ్చారు. బస్సులు ఆర్టీసీ బస్టాండ్‌కు రాకపోవడంతో సీఎం సభ ముగిసే వరకు జనం బస్టాండ్‌లో నిరీక్షించారు. అంబేడ్కర్‌ సర్కిల్‌, టీ కూడలి, గాంధీ సర్కిల్‌, కుందుర్పి, శెట్టూరు రోడ్డులో బారీకేడ్లు పెట్టి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కాన్వాయ్‌ ‌్రçయల్‌రన్‌ అంటూ గంటల కొద్ది వాహనాలను నిలిపివేశారు. చంటి పిల్లలతో ద్విచక్రవాహనంలో వచ్చిన మహిళలు, వైద్యం కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తప్పని పరిస్థితుల్లో ఇరుకు సంధుల్లో కష్టాలు పడుతూ వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని