logo

కరోనా పరీక్షలుచేయడం లేదంటూఆందోళన

మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో తెలిసిన వారికే గోప్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేపట్టారు. వీరికి సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళీ మద్దతు తెలిపారు. ఒకసారి కిట్లు లేవని, మ

Published : 22 Jan 2022 05:59 IST


జిల్లా ఆసుపత్రి వద్ద బాధితుల నిరసన

 

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో తెలిసిన వారికే గోప్యంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని పలువురు బాధితులు శుక్రవారం ఆసుపత్రి ఆవరణలో ఆందోళన చేపట్టారు. వీరికి సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళీ మద్దతు తెలిపారు. ఒకసారి కిట్లు లేవని, మరోసారి ఓపీ పేరుతో కాలయాపన చేస్తూ.. రెండు రోజులుగా ఆసుపత్రి చుట్టూ తిప్పుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు, ఆసుపత్రి వైద్యాధికారులకు కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై సూపరింటెండెంట్‌ ఆంజనేయులు మాట్లాడుతూ.. ఓపీలో పరీక్షించి అవసరమైన వారికి మాత్రమే ప్రభుత్వ నిబంధనల మేరకు కొవిడ్‌ పరీక్షలు చేస్తామన్నారు.

రుయాలో రోజుకు 60 మందికే..

తిరుపతి వైద్యవిభాగం: రుయాలో కిట్ల కొరతతో కొవిడ్‌ పరీక్షల కోసం బాధితులు నిరీక్షించాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం మొదట వచ్చిన 60 మందికే టోకెన్లు జారీ చేసి కొంతమంది నుంచే శ్వాబ్‌ సేకరించారు. మిగిలిన వారికి కిట్లు వచ్చాక శ్వాబ్‌ సేకరిస్తామని చెప్పడంతో వేచి చూశారు. మధ్యాహ్నం అయినా పరీక్షలు చేయకపోవడంతో వాగ్వాదానికి దిగారు. సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న కొవిడ్‌ పరీక్ష కేంద్రం ఇన్‌ఛార్జి డాక్టర్‌ రోజా రమణి అక్కడి వచ్చి ప్రజలను సముదాయించారు. వేచి ఉన్న వారి నుంచి శ్వాబ్‌ సేకరించారు.

రుయా కొవిడ్‌ పరీక్ష కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న బాధితులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని