logo

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్‌

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను

Published : 29 Jun 2022 02:24 IST

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి

తిరుపతి(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి బాక్ల్‌స్పాట్స్‌ గుర్తించాలన్నారు. జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల్లో 102, రాష్ట్ర రహదారుల్లో 29 బ్లాక్‌స్పాట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. జిల్లా రవాణాశాఖ అధికారి సీతారామ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఇంజినీరింగ్‌, పోలీసు, రవాణా, ఆరోగ్యశాఖ అధికారులతో రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని లీడ్‌ ఏజెన్సీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అర్బన్‌ ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ వాహన డ్రైవర్లు రాత్రి సమయాల్లో విశ్రాంతి తీసుకునేలా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ అనుపమ అంజలి, డీఆర్వో శ్రీనివాసరావు, బర్డ్‌ డైరెక్టర్‌ రెడ్డెప్ప, డీపీవో రూపేంద్రనాథ్‌రెడ్డి, డీఎంహెచ్‌వో శ్రీహరి, జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారి సుధాకర్‌రెడ్డి, ఎన్‌హెచ్‌ 71 పీడీ హరికృష్ణ, ఆర్టీసీ అధికారి చెంగల్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీఎస్పీ విజయశేఖర్‌, నాయుడుపేట మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

* నవరత్నాల అమలు, సీజనల్‌ వ్యాధులు, అంటువ్యాధులు, కొవిడ్‌-19 నియంత్రణపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. కొత్త జిల్లా ఏర్పడిన నాటి నుంచి 6047 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 83 మందికి పాజిటివ్‌ తేలిందన్నారు. జిల్లాలో 8 ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ కిట్లు కనీసం 400 ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని