logo

బంగారు బిస్కెట్లు తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

పన్నులు చెల్లించకుండా బంగారు బిస్కెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.

Published : 22 Mar 2023 03:12 IST

గుడిపాల, న్యూస్‌టుడే: పన్నులు చెల్లించకుండా బంగారు బిస్కెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఓ కారులో సుమారు 2.50 కేజీల బంగారాన్ని చెన్నై నుంచి చిత్తూరు మీదుగా  తీసుకెళుతున్నారని విజయవాడలోని డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు గుడిపాల మండలం నరహరిపేట చెక్‌పోస్ట్‌ వద్ద స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు చేయిస్తుండగా ఓ కారు డ్రైవర్‌ ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. చివరకు కారును గట్టిగా తట్టడంతో అద్దం పగిలింది. అనంతరం కారులో ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసులు, డ్రైవర్‌ రమేష్‌ను డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. బంగారు బిస్కెట్లతోపాటు వారిని విజయవాడకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు