logo

శిథిల భవనాల్లో బిక్కుబిక్కుమంటూ విధులు

జిల్లాలోని పెళ్లకూరు, ఓజిలి తహసీల్దారు కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. పాతికేళ్ల కిందట నిర్మించిన భవనాలు కావడంతో వర్షాలకు ఉరుస్తున్నాయి.

Published : 31 Mar 2023 02:33 IST

పెళ్లకూరు తహసీల్దార్‌ కార్యాలయ గోడపై దిగిన వేర్లు

న్యూస్‌టుడే, పెళ్లకూరు: జిల్లాలోని పెళ్లకూరు, ఓజిలి తహసీల్దారు కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. పాతికేళ్ల కిందట నిర్మించిన భవనాలు కావడంతో వర్షాలకు ఉరుస్తున్నాయి. దస్త్రాలకు భద్రత లేకుండా ఉంది. గోడలు పగుళ్లిచ్చి పాములకు ఆవాసంగా మారాయి. చీమలపుట్టలు.. చెదలతో భయానకంగా మారాయి. ఉద్యోగులపై పెచ్చులూడి పడుతున్న పరిస్థితి. కాగా శాశ్వత భవనాలకు దిక్కులేకుండా ఉంది. ముఖ్యమంత్రికి దరఖాస్తు చేసినా మంజూరు కాని దుస్థితి. ఇక్కడి ఉద్యోగులు ఉదయం రాగానే ఎక్కడ పాములున్నాయో తెలియక హడలిపోతున్నారు. గతేడాది ఏకంగా ఏడు పాములను పెళ్లకూరు తహసీల్దార్‌ కార్యాలయంలో పట్టుకున్నప్పటి నుంచి విధుల నిర్వహణ దినదినగండంగా మారింది.

ఉరుస్తుండటంతో తడిసిపోతున్న దస్త్రాలు

విరిగిన దస్త్రాల గది తలుపు

ఓజిలిలో పెచ్చులూడుతున్న పైకప్పు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని