మత్తు వదిలించేందుకు రోడ్డెక్కిన పోలీసులు
ఆధ్యాత్మిక నగరానికి పట్టిన మత్తును వదిలించేందుకు పోలీసులు రోడ్డెక్కారు. తిరుపతిలోని అన్ని పోలీస్‌స్టేషన్ల సిబ్బంది మందుబాబులను నిలువరించేందుకు నిశిత తనిఖీలు చేపట్టారు.
తిరుపతి (నేరవిభాగం): ఆధ్యాత్మిక నగరానికి పట్టిన మత్తును వదిలించేందుకు పోలీసులు రోడ్డెక్కారు. తిరుపతిలోని అన్ని పోలీస్‌స్టేషన్ల సిబ్బంది మందుబాబులను నిలువరించేందుకు నిశిత తనిఖీలు చేపట్టారు. తిరుపతిలో మద్యం విక్రయాల నేపథ్యలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ‘మాటల్లో నిషేధం.. మత్తులో ఆధ్యాత్మిక నగరం’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీసులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. శుక్రవారం అదనపు ఎస్పీ కులశేఖర్ పర్యవేక్షణలో చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్, తిరుపతి రూరల్ పోలీసులు బైరాగిపట్టెడ, అన్నమయ్య కూడలి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్వీయూ సీఐ రవీంద్రనాథ్, తిరుపతి సీఐ బీవీ శివప్రసాద్‌రెడ్డి తమ బృందాలతో పలు కూడళ్లు, తితిదే వసతి సముదాయాల వద్ద తనిఖీలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో అల్లర్లు సృష్టించడం, మద]్యం తాగడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రకటన ఏజెన్సీలకు తాఖీదులు
తిరుపతి(నగరపాలిక): తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అనధికారిక బ్యానర్లు, ఫ్లెక్సీల వ్యవహారంపై ‘ఈనాడు’లో ఈ నెల 5న ‘నగరంలో ప్రచారం ఉచితం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కమిషనర్ హరిత స్పందించారు. అనధికారిక బ్యానర్లు, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. తొలగించినట్లు పట్టణ ప్రణాళిక విభాగాధికారులు ప్రకటన విడుదల చేశారు. నగరపాలిక పరిధిలో ప్రకటన ఏజెన్సీలకు బకాయిలు చెల్లించాలని తాఖీదులు జారీ చేసినట్లు వారు ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.