logo

వైకాపా జెండా కప్పుకోలేదంతే.. పార్టీ కార్యక్రమాల్లో ఉపాధి ఉద్యోగి చిందులు

అతడు ఉపాధి హామీ పథకంలో ఓ ఉద్యోగి.. పోషించేది మాత్రం అధికార పార్టీ నాయకుడి పాత్ర.. తన భార్య సర్పంచిగా ఉండటంతో అతడు అధికార పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Updated : 14 Feb 2024 09:21 IST

 ద్విచక్ర వాహన ర్యాలీలో చిందులు వేస్తున్న సాంకేతిక సహాయకుడు

ఈనాడు, చిత్తూరు: అతడు ఉపాధి హామీ పథకంలో ఓ ఉద్యోగి.. పోషించేది మాత్రం అధికార పార్టీ నాయకుడి పాత్ర.. తన భార్య సర్పంచిగా ఉండటంతో అతడు అధికార పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అతడే పెనుమూరు మండలంలో ఉపాధి హామీ పథకంలో సాంకేతిక సహాయకుడు మధువనన్‌. స్వస్థలం పాలసముద్రం. గత నెల 30న పాలసముద్రం మండలంలో జరిగిన ఆసరా చెక్కు పంపిణీ కార్యక్రమంలో అన్నీ తానై నడిపించిన విషయం మరవక ముందే తాజాగా వైకాపా నిర్వహించిన ద్విచక్ర వాహన ప్రదర్శనలో నాయకులతో కలిసి చిందులేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాలసముద్రం మండలంలో వైకాపా నాయకులు సిద్ధం కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మధువనన్‌ నాయకులను చేయిపట్టి లాగి నృత్యం చేయాలని బలవంతం చేయడమే కాకుండా తానూ అందరితో కలిసి చిందులేశారు. విధులకు సెలవు పెట్టిన అతడు సొంత మండలంలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయమై డ్వామా పీడీ రాజశేఖర్‌ను వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదని, ఏపీడీ ద్వారా నివేదిక తెప్పించుకుని వాస్తవమని తేలితే తప్పక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని