logo

రెండో రోజూ హైడ్రామా!

రేణిగుంట మండలం పీసీఆర్‌ గోదాము వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. రామకృష్ణాపురం సమీపంలోని గోదాము వద్ద హైడ్రామా మంగళవారం జరగ్గా.. అది కొనసాగింది.

Published : 28 Mar 2024 03:17 IST

·తెదేపా నేతల ఫిర్యాదు అనంతరం గోదాములో తనిఖీలు

వైకాపా అభ్యర్థి, పార్టీ ఖాతాలో జమ చేస్తామన్న ఆర్డీవో

 

గోదాములోని వైకాపా ప్రచార సామగ్రి

రేణిగుంట, న్యూస్‌టుడే: రేణిగుంట మండలం పీసీఆర్‌ గోదాము వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. రామకృష్ణాపురం సమీపంలోని గోదాము వద్ద హైడ్రామా మంగళవారం జరగ్గా.. అది కొనసాగింది. విమానాశ్రయ కూడలి సమీపంలోని పీసీఆర్‌ గోదాములను తెరవాలని శ్రీకాళహస్తి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి, తెదేపా నేత నరసింహయాదవ్‌తో పాటు తెదేపా కార్యకర్తలు కోరినా రెవెన్యూ అధికారులు స్పందించలేదు. దీంతో సుధీర్‌రెడ్డి కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడంతో  సాయంత్రం పార్టీ ప్రచార సామగ్రి ఉన్నాయని ఫిర్యాదు అందడంతో పీసీఆర్‌ గోదామును ఆర్డీవో రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెరిచి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో  మాట్లాడుతూ  గోదాములో ఉన్న వైకాపా ప్రచార సామగ్రిని అభ్యర్థి, పార్టీ ఖాతాలో జమ చేస్తామన్నారు. తనిఖీల అనంతరం ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపిస్తామన్నారు. గోదాములు తెరిచిన వెంటనే మీడియా లోపాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. మీరు ఎందుకు వచ్చారని రేణిగుంట తాహసీల్దార్‌ నాగేశ్వరరావు ప్రశ్నించారు. గోదాములను తెరిచిన వెంటనే మీడియాను అనుమతించలేదు.  

‘జీఎస్టీ చెల్లించే సామగ్రి కొన్నాం’: సాధారణ ఎన్నికల కోసం గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ నెల 14 వరకు వివిధ సంస్థల నుంచి జీఎస్టీ చెల్లించి సామగ్రి కొనుగోలు చేశామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. వీటి రసీదులు, బిల్లులు ఎన్నికల సంఘానికి సమర్పించామని చెప్పారు. ఎన్నికల సంఘం అనుమతితోనే సామగ్రిని పంపిణీ చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని