logo

వృద్ధులు.. దివ్యాంగుల ఓట్లపై వాలంటీర్ల గురి

చిత్తూరు జిల్లా పంచాయతీ, గూడూరు, న్యూస్‌టుడే: దివ్యాంగులైన ఓటర్లు, వృద్ధులకు కల్పించిన వెసులుబాటును వైకాపా అడ్డదారుల్లో వాడుకునే ఎత్తుగడ చేస్తోంది.

Updated : 28 Mar 2024 05:05 IST

సేకరించిన సమాచారంతో ఇళ్ల వద్దకు పరుగులు

 దరఖాస్తులతో వాలిపోతున్న వైనం

చిత్తూరు జిల్లా పంచాయతీ, గూడూరు, న్యూస్‌టుడే: దివ్యాంగులైన ఓటర్లు, వృద్ధులకు కల్పించిన వెసులుబాటును వైకాపా అడ్డదారుల్లో వాడుకునే ఎత్తుగడ చేస్తోంది. ఇప్పటికే వాలంటీర్ల ద్వారా సేకరించి ఓటర్ల సమాచారం మేరకు ఎక్కడెక్కడ ఫారం 12డి అవసరమో గుర్తించి వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. పత్రాలు పట్టుకుని నేరుగా వారి నుంచి సంతకాలు తీసుకుని సహాయ రిటర్నింగ్‌ అధికారులకు పంపడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇవి ఎక్కువగా వృద్ధులు, వైకల్యం ఉన్న ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.

  •  ఉమ్మడి జిల్లాలో 45 వేలు వరకు 85 ఏళ్లు దాటిన వారితో పాటు దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో  4 వేలు నుంచి 3 వేలు వరకు ఉన్నారు. వీరికి ఎక్కువగా వృద్ధాప్య, వైకల్యం పింఛన్లు ఇస్తున్నారు. ఇలాంటి వారిని వాలంటీర్లు లొంగదీసుకునే యత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇస్తున్న పింఛన్ల, ఇతర పథకాల ఆధారంగా మీరంతా ఓట్లేయకుంటే పథకాలు ఆగిపోతాయన్న మౌఖిక హెచ్చరికలు చేస్తున్నారు. ఈకేవైసీ పేరిట ఇప్పటికే అనేక దఫాలు చిత్రాలు, వీడియోలు తీసుకున్న పరిస్థితి కాగా మీ వివరాలు మా దగ్గర ఉన్నాయి. ఎవరికి ఓటేస్తారో తెలిసి పోతుంది అంటూ బెదిరిస్తున్నారు.
  •   పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేని వారికి ఇళ్ల దగ్గరే ఓటేయడానికి ఎన్నికల సంఘం సౌకర్యం కల్పించింది. దీనికి వీరంతా ముందుగానే ఫారం 12డి ద్వారా ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వృద్ధులు, దివ్యాంగులైన వారి నుంచి దరఖాస్తులు పెట్టించే ఎత్తుగడలో వాలంటీర్లు నిమగ్నమయ్యారు.
  •  పుంగనూరులో ఓ సచివాలయం పరిధిలో ఇదే తీరుగా దరఖాస్తు ఫారం పట్టుకుని వృద్ధుల వద్దకు వరుస కడుతున్నారు. అర్ధం కాని ఓ దివ్యాంగురాలు ప్రశ్నిస్తే మీరు ఇక్కడే ఓటేయవచ్చనని చెప్పడంతో కాదు మేం పోలింగ్‌ కేంద్రం వద్దే ఓటేస్తామన్నారు. ఇలా ఇరువురి మధ్య వివాదం రేగడంతో వాలంటీర్‌ వెనక్కి వెళ్లిన పరిస్థితి నెలకొంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని