logo

పుంగనూరులో ట్రేడింగ్‌ మోసగాడు

తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్‌ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్‌ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.

Published : 29 Mar 2024 02:36 IST

తెలంగాణ పోలీసుల సోదాలు

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆశ చూపి ట్రేడింగ్‌ మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని తెలంగాణ రాజధాని సైబరాబాబ్‌ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. తెలిసిన వివరాల మేరకు.. మదనపల్లెకు చెందిన కె.మురళి పుంగనూరులో వివాహం చేసుకున్నారు. సులభంగా సంపాదించేందుకు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ మోసాన్ని ప్రారంభించారు. ‘డీమార్ట్‌ కమర్శియల్‌ కస్టమర్స్‌’ పేరిట ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ప్రారంభించారు. ఎస్‌.ఎస్‌. రీసెర్చి కార్యాలయం పేరిట పుంగనూరులో ఆఫీసు నిర్వహిస్తూ.. 10 మంది టెలీ కాలర్లతో దందాకు తెరతీశారు. హైదరాబాద్‌కు చెందిన చెరువు భవానీ శంకర్‌ చైతన్య ఇందులో మొదట ర.46,939 పెట్టుబడి పెట్టారు. కొద్దిరోజులకే రూ.8,059 లాభం వచ్చినట్లు చూపారు. అత్యాశతో మరో రూ. 62 వేలను మూడు దఫాలుగా చెల్లించారు. వెంటనే నిర్వాహకుల ఫోన్లు పనిచేయలేదు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం పుంగనూరులో దాడులు చేసి నిర్వాహకుడు మురళి, సహాయకుడు వెంకటేష్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. సైబరాబాద్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు దాడులు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని