logo

నామినేషన్‌ నుంచి ఖర్చులన్నీ అభ్యర్థి ఖాతాకే..

నామినేషన్‌ ప్రక్రియ నుంచి ఎన్నికల ఖర్చులన్నీ పోటీచేసే అభ్యర్థి ఖాతాలోకి వస్తుందని జేసీ శ్రీనివాసులు అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల జిల్లా స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడారు.

Published : 17 Apr 2024 03:02 IST

చిత్తూరు కలెక్టరేట్‌: నామినేషన్‌ ప్రక్రియ నుంచి ఎన్నికల ఖర్చులన్నీ పోటీచేసే అభ్యర్థి ఖాతాలోకి వస్తుందని జేసీ శ్రీనివాసులు అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల జిల్లా స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి. నేర చరిత్రలేని వారిని పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించుకోవాలి. నామినేషన్‌ రుసుం మినహాయింపు కోరే అభ్యర్థి తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఇంకా నోడ్యూస్‌ సర్టిఫికేట్‌, బ్యాంకు ఖాతా పుస్తకం వివరాలు, 10 పాస్‌ పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు ఇవ్వాలి. పోస్టల్‌ బ్యాలెట్‌ను మే 3 తర్వాత ఇస్తాం. 12డి ధ్రువీకరణ పొందినవారు.. తమకు ఓటున్న నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి. జనవరి 22న తుది జాబితా ప్రచురణ తర్వాత నమోదైన ఓటర్లకు సంబంధించి అనుబంధ జాబితా విడుదల చేస్తాం. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు.. తాము ఉంటున్న ప్రాంతంలో ఓటరుగా నమోదై ఉంటే, లేదా ఇతర ప్రాంతంలో ఉంటే.. ఆ పత్రాల్ని సమర్పించాలని’ పేర్కొన్నారు. డీఆర్‌వో పుల్లయ్య, రాజకీయ పార్టీల ప్రతినిధులు లోకనాథం, గంగరాజు, సురేంద్రకుమార్‌, ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని