icon icon icon
icon icon icon

Pulivarthi Nani: పులివర్తి నానికి భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశం

చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Updated : 29 Apr 2024 15:50 IST

అమరావతి: చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కుటుంబసభ్యులకు కూడా భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరినా.. స్పందించకపోవడంతో పులివర్తి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున న్యాయవాది ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టు ఆదేశాలతో 2+2 భద్రత ఇచ్చి ఆ తర్వాత తొలగించారని తెలిపారు. భద్రత కల్పించాలని కోరినా పోలీసుశాఖ ఉత్తర్వులు ఇవ్వలేదని వివరించారు. దీంతో పోటీ చేసిన అభ్యర్థికి భద్రత ఇవ్వాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. నేటి(సోమవారం) నుంచే పులివర్తి నానికి, ఆయన కుటుంబసభ్యులకు 1+1 భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img