logo

ఎమ్మెల్యే అభ్యర్థి థామస్‌కు భద్రత కల్పించాలి

గంగాధరనెల్లూరు నియోజకవర్గ కూటమి పార్టీల ఉమ్మడి అభ్యర్థి థామస్‌కు భద్రత కల్పించాలని సదరు పార్టీల నేతలు పోలీసులను కోరారు.

Published : 17 Apr 2024 03:26 IST

వెదురుకుప్పం: గంగాధరనెల్లూరు నియోజకవర్గ కూటమి పార్టీల ఉమ్మడి అభ్యర్థి థామస్‌కు భద్రత కల్పించాలని సదరు పార్టీల నేతలు పోలీసులను కోరారు. మంగళవారం మండల తెదేపా మాజీ అధ్యక్షుడు మోహన్‌మురళి నేతృత్వంలో జనసేన, భాజపా, తెదేపా నేతలు పోలీసు స్టేషనుకు వచ్చి తమ అభ్యర్థికి రాజకీయ ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ ఈ మేరకు వినతిపత్రాన్ని స్టేషన్‌ ఇన్‌ఛార్జికి అందజేశారు. భాజపా నేత హనుమంతరెడ్డి, తెదేపా నేతలు చెంగల్రాయరెడ్డి, గంగయ్య, బీఎం రవి, వరప్రసాద్‌, మురగయ్య, చిన్నబ్బ, చంద్రశేఖర్‌, రాజగోపాల్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని