logo

రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్‌కుమార్‌రెడ్డి

ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.

Published : 20 Apr 2024 03:20 IST

పుంగనూరులో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం పుంగనూరు అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో మాజీ సీఎం, ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకే లొంగలేదని, అలాంటిది.. పీసీసీ పదవి కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి కాళ్లు పట్టుకొన్నట్లు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నాడు రాష్ట్రం విడిపోవడానికి, జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లడానికి కారుకుడని దుయ్యబట్టారు. తర్వాత ఆయన తన కుమార్తె శివశక్తితో కలసి వెళ్లి రెండు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. ఆయన సతీమణి స్వర్ణలత రెండు సెట్ల నామపత్రాలు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని