logo

లోక్‌సభకు 3.. శాసనసభకు 17

జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్‌సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు

Published : 20 Apr 2024 03:51 IST

రెండో రోజు నామపత్రాలు సమర్పించిన అభ్యర్థులు

 వైకాపా అభ్యర్థి గురుమూర్తి

 తిరుపతి (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్‌సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. తిరుపతి ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ నుంచి చింతా మోహన్‌, వైకాపా నుంచి గురుమూర్తి, నవ్యకిరణ్‌, సూళ్లూరుపేట శాసనసభ స్థానానికి వైకాపా నుంచి సుభాషిణి, తెదేపా నుంచి నెలవల విజయశ్రీ, కాంగ్రెస్‌ నుంచి తిలక్‌బాబు, వెంకటగిరికి సంబంధించి తెదేపా నుంచి లక్ష్మీసాయిప్రియ, రామకృష్ణల తరఫున నేతలు, ఇండిపెండెంట్‌గా ఆర్ముగం, ర్యాడికల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అంబేడ్కరిస్ట్‌ నుంచి షేక్‌షఫీ, చంద్రగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా శ్రీనివాసులు, తిరుపతి నుంచి వైకాపా అభ్యర్థిగా భూమన అభినయ్‌రెడ్డి, సోషలిస్ట్‌ యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా నుంచి లక్ష్మీ, ఇండిపెండెంట్‌గా కాంతారావు, శ్రీకాళహస్తి నుంచి నేషనలిస్ట్‌ జనశక్తి పార్టీ నుంచి డా.గానుగపెంట రమేష్‌, సత్యవేడు నుంచి తెదేపా అభ్యర్థిగా ఆదిమూలం, ఇండిపెండెంట్‌గా జడ్డా రాజశేఖర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ పురస్కరించుకుని ఆర్వో కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత, అభ్యర్థుల నామినేషన్‌ పత్రాల పరిశీలన కౌంటర్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ కౌంటర్లు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న ఇండియా కూటమి అభ్యర్థి చింతా మోహన్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని