logo

విద్యార్థుల్లో నైపుణ్య సామర్థ్యాల పెంపునకు ప్రణాళిక

డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం కోసం ప్రతి డిగ్రీ కళాశాల స్పష్టమైన నివేదికలివ్వాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా డిగ్రీ కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో

Published : 13 Aug 2022 03:41 IST

మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌

అమలాపురం(అల్లవరం), న్యూస్‌టుడే: డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం కోసం ప్రతి డిగ్రీ కళాశాల స్పష్టమైన నివేదికలివ్వాలని కలెక్టర్‌ హిమాన్షుశుక్లా డిగ్రీ కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కళాశాలల యాజమాన్యాలు, పరిశ్రమలు, వికాస, కార్మికశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో రెండు నెలలు, తృతీయ సంవత్సరంలో ఆరు నెలలపాటు ఇంటర్న్‌షిప్‌నకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. విద్యార్థుల పేర్లను లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం యాప్‌లో నమోదు చేయాలన్నారు. పరిశ్రమలశాఖ సహాయ సంచాలకులు శివరామప్రసాద్‌ మాట్లాడుతూ కళాశాలలు ముందుగానే వివరాలివ్వాలన్నారు. డీఆర్వో సత్తిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ హిమాన్షుశుక్లా పురపాలికల కమిషనర్లతో వర్చువల్‌ విధానంలో అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి శుక్రవారం సమీక్షలుంటాయన్నారు. అయ్యప్పనాయుడు, శ్రీకాంత్‌, రామకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పోషకాహార లోపం నివారణకు చర్యలు
మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలోనూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకుని పోషకాహార లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. శుక్రవారం ఆయన సమీక్షించారు. పథక సంచాలకులు, సీడీపీవోలు లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. జిల్లా అధికారిణి సత్యవాణి, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని