logo

తీర దారి.. రూపుమారి

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర రహదారి భారీ వర్షాలకు భారీ గుంతలతో రూపుమారింది. ప్రయాణికులకు నరకం చూపిస్తోంది.

Published : 17 Aug 2022 06:14 IST

ఉప్పాడ బీచ్‌ రోడ్డుపై భారీ గొయ్యి

యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర రహదారి భారీ వర్షాలకు భారీ గుంతలతో రూపుమారింది. ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. తుపాను తాకిడికి ధ్వంసమవ్వడంతో ఇటీవల మరమ్మతులు నిర్వహించి గోతులు పూడ్చారు. కెరటాల విధ్వంసం ఆగకపోవడంతో పలు చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. దీంతో ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందిపడుతున్నారు. చిన్నపాటి వాహనమైతే గోతుల్లో దిగబడిపోతున్నాయి. పలువురు ద్విచక్రవాహన చోదకులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు.  అధికారులు స్పందించి గోతులు పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కొత్తపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని