logo

మహిళపై దాడి కేసులో 19 మందికి జైలు

చేతబడికి పాల్పడుతోందన్న అభియోగంతో ఓ మహిళపై దాడి చేసిన పలువురికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Published : 08 Dec 2022 03:58 IST

కడియం, న్యూస్‌టుడే: చేతబడికి పాల్పడుతోందన్న అభియోగంతో ఓ మహిళపై దాడి చేసిన పలువురికి కోర్టు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. కడియం మండలం వేమగిరిలోని గణపతినగర్‌లో పెంటా అక్కమ్మ అలియాస్‌ కళావతి నివాసం ఉండేది. ఆమెపై కొందరు స్థానికులు చేతబడికి పాల్పడుతోందని అభియోగం చేయడంతో ఆమె మాధవరాయుడుపాలెం పరిధిలోని చైతన్యనగర్‌కు వెళ్లిపోయింది. 2014 మార్చి 25న కరెంటు బిల్లు కోసమని వేమగిరిలోని గణపతినగర్‌కు వచ్చింది. ఆమెపై స్థానికులు 19 మంది దాడి చేయడమే గాక, కళ్లల్లో కారం చల్లి, దంతాలు పీకేసినట్లు కడియం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఏఎస్‌ఐ అడపా శివాజీ కేసు నమోదు చేసి ఎస్‌.ఐ. టి.నరేశ్‌తో కలిసి దర్యాప్తు జరిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి వారిపై అభియోగపత్రం నమోదు చేశారు. రాజమహేంద్రవరంలోని మొదటి అడిషనల్‌ సెషన్స్‌ కోర్టులో ఈ కేసు బుధవారం విచారణకు రాగా  నేరం రుజువు కావడంతో 14 మందికి జస్టిస్‌ ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3,500 జరిమానా విధించారు. మరో అయిదుగురికి ఏడాది జైలుశిక్ష, రూ.3,500 జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు. ఈ కేసును పీపీగా జి.వెంకటరత్నంబాబు వాదించారు. సకాలంలో న్యాయస్థానానికి సాక్షులను ప్రవేశపెట్టిన హెడ్‌కానిస్టేబుల్‌ విశ్వేశ్వరరావును కడియం సీఐ పీవీజీ తిలక్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని