logo

ఎన్నికల ఏర్పాట్లపై నియోజకవర్గాల వారీగా నివేదికలు

సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత ఆదేశించారు.

Published : 28 Mar 2024 03:03 IST

సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, ఆర్వోలు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గాల వారీగా నివేదికలు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత ఆదేశించారు. బుధవారం వెలగపూడి నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా దూరదృశ్య సమావేశం ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించగా కలెక్టరేట్‌ నుంచి జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ ఆర్వోలతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఏప్రిల్‌ 18 నుంచి నామినేషన్లు స్వీకరించి తదుపరి ప్రక్రియకు సన్నద్ధం కావాలన్నారు. నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించాల్సిన పనులు, సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ముందుగా ప్రిసైడింగ్‌ అధికారి(పీవో), సహాయక ప్రిసైడింగ్‌ అధికారి(ఏపీవో), ఇతర పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహణకు అనువైన ప్రాంతాలు గుర్తించి అక్కడ తాగునీరు, విద్యుత్తు ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌ల గుర్తింపు, ఈవీఎంల కమిషనింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, అక్కడ విధులు నిర్వర్తించడం కోసం అధికారులు, సిబ్బందికి చెందిన రూట్‌ప్రోగ్రాం సిద్ధం చేసుకోవాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫారం-7, 8 దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని