logo

సీఎం వస్తున్నారు.. మరి జనమో!

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు.

Updated : 18 Apr 2024 08:13 IST

రోడ్‌షోకు వస్తే రూ.200 అంటూ వైకాపా బేరసారాలు

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధం యాత్ర గురువారం కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. సీఎం రోడ్డుషోకు జనాలను తరలించేందుకు వైకాపా నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. రాజమహేంద్రవరంలోని ఆయా డివిజన్లలో బేరసారాలు మొదలుపెట్టారు. రోడ్డుషోకు వచ్చే ఒక్కొక్కరికీ రూ.200 చొప్పున ఇస్తామంటూ జనసమీకరణ చేస్తున్నారు. రాజమహేంద్రవరం నగర పరిధిలో 22 డివిజన్ల మీదుగా సీఎం రోడ్డుషో జరగనుంది. ఒక్కొక్క డివిజన్‌ నుంచి 1,000 నుంచి 1,500 మందిని తరలించనున్నారు. రోడ్డుషో సాగే మార్గం వెంబడి జనాలను పెట్టేందుకు ఆయా డివిజన్ల పార్టీ ఇన్‌ఛార్జులు, నాయకులు బేరాలు సాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని