logo

అతివే నిర్ణేత.. నేతలరాత..!

సార్వత్రిక ఎన్నికలు 2024లో నాయకుల తలరాతను అతివలే నిర్ణయించనున్నారు. ఇంతులు మెచ్చినవారికే పదవులు దక్కనున్నాయి.

Updated : 30 Apr 2024 07:06 IST

జిల్లా ఓటర్లు 15,31,410

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు 2024లో నాయకుల తలరాతను అతివలే నిర్ణయించనున్నారు. ఇంతులు మెచ్చినవారికే పదవులు దక్కనున్నాయి. జిల్లావ్యాప్తంగా మే 13న జరగనున్న ఎన్నికల్లో హక్కు వినియోగించుకునే ఓటర్ల సంఖ్య తేలింది. ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 15,31,410 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల, మార్పుచేర్పులు, తొలగింపుల ప్రక్రియ పూర్తయింది. మృతులు, వలసదారులు ఇతరుల ఓట్లు తొలగించి తుది జాబితాను సోమవారం కలెక్టర్‌ హిమాన్షుశుక్లా విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లు 7,59,104, మహిళా ఓటర్లు 7,72,285 మంది, ఇతరులు 21 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు 13,181 మంది అధికంగా ఉన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో కొత్తపేట నియోజకవర్గంలో అత్యధికంగా 2,52,383 మంది జిల్లాలో అత్యల్పంగా రాజోలు నియోజకవర్గంలో 1,97,920 మంది ఓటర్లున్నారు.

రెండు నెలల్లో 42 వేల మంది:

ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 14,88,794 మంది ఓటర్లు నమోదైయ్యారు. అనంతరం రెండు నెలల పాటు కొత్త ఓట్ల నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. దీనిలో భాగంగా సోమవారం విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 15,31,410 మందికి పెరిగారు. ఈ లెక్కన రెండు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 42,616 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో మహిళా ఓటర్లు 24,262 మంది, పురుషుల ఓటర్లు 18,355 మంది పెరిగారు. నియోజకవర్గాల వారీగా అమలాపురంలో అత్యధికంగా 7,126 మంది, అత్యల్పంగా రామచంద్రపురంలో 5,026 మంది ఓటర్లు పెరిగారు.

  • ఇతరులు  రామచంద్రపురం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో ఒకరు చొప్పున, పి.గన్నవరం, కొత్తపేట, మండపేటల్లో ఆరుగురు చొప్పున ఉన్నారు. ముమ్మిడివరం పరిధిలో ఓటర్లుగా లేరు.

పలు వర్గాల వారీగా

జిల్లాలో ఎన్నారై ఓటర్లు 277, సర్వీస్‌ ఓటర్లు 819 మంది, 18-19 సంవత్సరాల వయసు ఉన్న వారు 38,480 మంది, 85 సంవత్సరాలు పైబడినవారు 8,344, దివ్యాంగులు 26,039, దృష్టి లోపంతో బాధపడుతున్న వారు 3,534 మంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని