logo

స్వగ్రామానికి ఎన్నారై దంపతుల సేవలు

స్వగ్రామానికి ఎన్నారై దంపతులు పూనాటి రవీంద్ర, సరోజినిలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. టైమ్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రావినూతలతో శనివారం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు.

Published : 03 Jul 2022 06:27 IST

ఫౌండేషన్‌ ద్వారా ఉచిత విద్య పొందిన బాలికలతో వ్యవస్థాపకులు

రావినూతల (మేదరమెట్ల), న్యూస్‌టుడే: స్వగ్రామానికి ఎన్నారై దంపతులు పూనాటి రవీంద్ర, సరోజినిలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. టైమ్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రావినూతలతో శనివారం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. గ్రామం పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మరుగుదొడ్లను నిర్మించడం మంచి కార్యక్రమం అన్నారు. టైమ్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు పూనాటి రవీంద్ర మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్పటికే 50 మరుగుదొడ్లను నిర్మించామని, రూ.10 లక్షల వ్యయంతో మరో 50 నిర్మిస్తున్నామని తెలిపారు. చదువుల్లో రాణిస్తున్న 10 మంది విద్యార్థులను చదివిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నిర్మాణం పూర్తిచేసుకున్న మరుగుదొడ్లను ప్రారంభించారు. మోపర్తి వెంకట్రావు, దామా వెంకటసుబ్బయ్య, అనుబ్రోలు ప్రభాకర్‌రావు, దామా శ్రీను, మోపర్తి రాధాకృష్ణ, రామినేని శ్రీరంజని, నల్లూరి చెంచయ్య, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని