logo

చంద్రబాబు బహిరంగ సభ జయప్రదానికి పిలుపు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈనెల 15న నిర్వహించే తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. గుంటూరు స్తంభాలగరువులోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే బహిరంగ....

Published : 13 Aug 2022 06:19 IST

చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో ఏర్పాట్లకు భూమిపూజలో నేతలు


భూమిపూజ నిర్వహిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈనెల 15న నిర్వహించే తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. గుంటూరు స్తంభాలగరువులోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లకు శుక్రవారం గుంటూరు పశ్చిమ తెదేపా ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జి మహమ్మద్‌ నసీర్‌, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ తదితర నాయకులు భూమిపూజ నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నేతల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అటువంటి రాజకీయాలకు స్వస్తి పలికి పేదరికం లేని సమాజం కోసం కృషి చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు.  చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జరిగే బహిరంగ సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెనాలి శ్రవణ్‌కుమార్‌ కోరారు. నక్కా ఆనందబాబు మాట్లాడుతూ దేశంపై బాధ్యతను, దేశభక్తిని అందరూ చాటాలన్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఈనెల 13, 14, 15 తేదీల్లో ప్రతి తెదేపా కార్యకర్త తమ ఇళ్లపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు