logo

వాటర్‌షెడ్‌తో సత్ఫలితాలు

వాటర్‌షెడ్‌ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని మాజీ సర్పంచి, వాటర్‌షెడ్‌ కమిటీ ఛైర్మన్‌ బారెడ్డి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఫుణెలో 22 నుంచి 24 వరకు కేంద్రం నిర్వహించిన జాతీయ వర్క్‌షాపునకు జిల్లా తరఫున ఆయన హాజరయ్యారు.

Published : 26 Sep 2022 06:11 IST

జాతీయ వర్క్‌షాపులో అనుభవాలు వివరించిన జిల్లా వాసి


అన్నా హజారే నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న వెంకటేశ్వరరెడ్డి

వినుకొండ, న్యూస్‌టుడే : వాటర్‌షెడ్‌ కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని మాజీ సర్పంచి, వాటర్‌షెడ్‌ కమిటీ ఛైర్మన్‌ బారెడ్డి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఫుణెలో 22 నుంచి 24 వరకు కేంద్రం నిర్వహించిన జాతీయ వర్క్‌షాపునకు జిల్లా తరఫున ఆయన హాజరయ్యారు. బొల్లాపల్లి మండలం తన స్వగ్రామం రేమిడిచర్లలో 2017,18,19 సంవత్సరాలలో వాటర్‌షెడ్‌ ద్వారా చేపట్టిన చెక్‌డ్యాంలు, కుంటలు, కొండ వాలులో ట్రెంచ్‌లు వంటి పనులు చేయడం ద్వారా భూగర్భ జలాల వృద్ధిని ఆయన వేదిక పై నుంచి వివరించారు. అనంతరం  అన్నా హజారే స్వగ్రామం గావేగాల్‌సిద్దికి వెళ్లి వర్షం నీటిని ఒడిసి పట్టిన తీరును పరిశీలించారు. అక్కడి నుంచి అహ్మద్‌నగర్‌ జిల్లాలోని పానోలి గ్రామంలో దేశంలోనే మొదటగా ఏర్పాటుచేసిన డిజిటల్‌ పాఠశాలను సందర్శించి అనుసరిస్తున్న విద్యా విధానాలను తెలుసుకున్నారు. అన్నా హజారే, కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్‌, మహారాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కపిల్‌పాటిల్‌ చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నారు. గాలేగావ్‌ సిద్ది విధానం మన జిల్లాలోని బొల్లాపల్లి, వెల్దుర్తి, దుర్గి వంటి మండలాల్లో అమలు చేయడం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. జాతీయ వర్కషాపునకు వెళ్లేందుకు అవకాశం కల్పించిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్‌, కలెక్టర్‌ శివశంకర్‌, డ్వామా పీడీ జోసెఫ్‌కుమార్‌కు ఆయన  కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని