logo

రూ.6.49 కోట్లు వడ్డీ రాయితీ అందజేత

జిల్లాలో వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం 2022 రబీ, 2021 ఖరీఫ్‌ పంట కాలానికి జిల్లాలోని 27,741 మంది రైతులకు రూ.6.49 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.

Published : 29 Nov 2022 04:51 IST


రైతులకు చెక్కును అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం 2022 రబీ, 2021 ఖరీఫ్‌ పంట కాలానికి జిల్లాలోని 27,741 మంది రైతులకు రూ.6.49 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ మేరకు సోమవారం సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాకు సున్నావడ్డీ పథకాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, రైతులు కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించారు. అనంతరం రైతులకు కలెక్టర్‌ చెక్కును అందించారు.

సర్వే కిట్ల అందజేత

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష కార్యక్రమంలో పని చేస్తున్న సర్వేయర్లకు అవసరమైన కిట్లను, మెడికల్‌ కిట్లు, జియో పోస్టుపెయిడ్‌ సిమ్‌ కార్డులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జేసీ జి.రాజకుమారి సోమవారం ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో అందించారు. సుమారు 300 మందికి ఈ కిట్లను అందించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో చంద్రశేఖర్‌రావు, సర్వే ఏడీ రూప్లానాయక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని