logo

బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు: పీడీ

పర్చూరు మండలంలోని తిమ్మరాజుపాలెంలో గ్రామ సచివాలయాన్ని పీడీ, జిల్లా పంచాయతీ అధికారి శంకరనాయక్‌ సందర్శించారు.

Published : 04 Feb 2023 06:38 IST

నూతలపాడులో చెత్త సంపద కేంద్రం పరిశీలిస్తున్న డ్వామా పీడీ శంకరనాయక్

పర్చూరు, న్యూస్‌టుడే: పర్చూరు మండలంలోని తిమ్మరాజుపాలెంలో గ్రామ సచివాలయాన్ని పీడీ, జిల్లా పంచాయతీ అధికారి శంకరనాయక్‌ సందర్శించారు. గ్రామ సచివాలయ భవనం పనులకు సంబంధించి బిల్లులు ఎందుకు చెల్లించలేదని కార్యదర్శి మార్టిన్‌ లూథర్‌ను ప్రశ్నించారు. పంచాయతీ పాలకవర్గం సహకరించడంలేదని కార్యదర్శి చెప్పారు. నిబంధనల ప్రకారం జరిగిన పనులకు బిల్లు చెల్లించకుంటే చర్యలు తీసుకుంటానని శంకరనాయక్‌ హెచ్చరించారు. బిల్లుల చెల్లింపు జరిగేలా చూడాలని ఎంపీడీవో లక్ష్మీదేవికి సూచించారు. చెరువు స్థలం స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ఇంత వరకు ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని కార్యదర్శి, ఎంపీడీవోలను ప్రశ్నించారు. న్యాయస్థానం ఉత్తర్వులు అమలు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, చెరువు స్థలం కొలతలు వేసి హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని, స్థలం పంచాయతీకి చెందినదని బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఉప్పుటూరు పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. పంచాయతీ నిధులతో చేసిన పనులకు బిల్లు చెల్లించడం లేదని స్థానికుడి ఫిర్యాదుపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని పీడీ తెలిపారు.

వర్మీ కంపోస్టుపై అవగాహన కల్పించాలి

చెత్త సంపద కేంద్రాలలో తయారు చేస్తున్న వర్మీ కంపోస్టు ఎరువును రైతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని డ్వామా పీడీ వై.శంకరనాయక్‌ సూచించారు. పర్చూరు మండలం నూతలపాడులో చెత్త సంపద కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. నాగులపాలెంలో ఉపాధి పనులను పీడీ చూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని