logo

రక్తహీనత నివారణకు రాగిజావ దోహదం

జిల్లాలోని పాఠశాల బాలబాలికల్లో రక్తహీనత సమస్య నివారణకు రాగిజావ దోహదపడుతుందని కలెక్టర్‌ శివశంకర్‌ అన్నారు.

Published : 22 Mar 2023 05:26 IST

రాగిజావ పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్‌ శివశంకర్‌ తదితరులు

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని పాఠశాల బాలబాలికల్లో రక్తహీనత సమస్య నివారణకు రాగిజావ దోహదపడుతుందని కలెక్టర్‌ శివశంకర్‌ అన్నారు. మున్సిపల్‌ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు గోరుముద్ద అమలులో భాగంగా ఉదయం రాగిజావ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లి నుంచి సీఎం ప్రారంభించిన కార్యక్రమంలో వీడియో కాన్పరెన్స్‌ ద్వారా కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 77494 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. 43219 మంది విద్యార్థినుల్లో రక్తహీనత ఉన్నట్లు గుర్తించామన్నారు. రాగిజావ వారంలో మూడు రోజులు అందిస్తారని తద్వారా రక్తహీనత నివారించేందుకు అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా రాగిజావ తీసుకోవాలన్నారు. ఈసందర్భంగా విద్యార్థి తల్లి కాంచన సీఎంతో మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్వో వినాయకం, డీఈవో శామ్యూల్‌, డీఆర్‌డీఎ పీడీ బాలూనాయక్‌, ఎంఈవో జ్యోతికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని