logo

హనుమంతరావు సేవలు అభినందనీయం

 గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమానికి హనుమంతరావు ఎన్నో పోరాటాలు చేసి అందరి అభిమానాన్ని పొందారని ద.మ.రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శంకరరావు కొనియాడారు.

Published : 31 May 2023 05:48 IST

హనుమంతరావు దంపతులను సన్మానిస్తున్న రామకృష్ణ, పక్కన శ్రీనివాస్‌, శంకరరావు తదితరులు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమానికి హనుమంతరావు ఎన్నో పోరాటాలు చేసి అందరి అభిమానాన్ని పొందారని ద.మ.రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శంకరరావు కొనియాడారు. హనుమంతరావు ఉద్యోగ విరమణ సందర్భంగా రైల్‌ మహల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అభినందన సదస్సులో శంకరరావు మాట్లాడుతూ 16 ఏళ్లు యూనియన్‌ కార్యదర్శిగా పని చేసి రికార్డు సృష్టించారన్నారు. అనంతరం హనుమంతరావు దంపతులను డీఆర్‌ఎం రామకృష్ణ, ఏడీఆర్‌ఎంలు శ్రీనివాస్‌, సైమన్‌, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శంకరరావు తదితరులు సన్మానించారు. సమావేశంలో సంఘ నాయకులు కృష్ణయ్య, మంజునాథ్‌, ప్రసాద్‌, కరుణశ్రీ, పలువురు అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు మజ్దూర్‌ యూనియన్‌ కార్యాలయంలో కార్మికుల సంక్షేమ కోసం పోరాటం చేస్తూ అమరులైన నాయకుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని శంకరరావు ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని