logo

మొదలైన నామినేషన్ల పర్వం

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్‌ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు.

Published : 19 Apr 2024 05:16 IST

ఎంపీకి 5, ఎమ్మెల్యే స్థానాలకు 18 దాఖలు
నేడు, రేపు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామపత్రాలు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్‌ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. నేడు, రేపు ప్రధాన పార్టీల అభ్యర్థులు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నామినేషన్ల తొలి రోజున గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు అందించారు. అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లో దాఖలు చేశారు. పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలు మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాలతో పాటు, పార్లమెంట్‌ స్థానానికి నామినేషన్లు పడ్డాయి. ఆయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేశారు. అత్యధికంగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు 14 నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున అంబటి చలమయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా డి.రత్నం, ఎ.గాయత్రి, ఎ.శ్రీకృష్ణ, షేక్‌ అస్లాంఅక్తర్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని