logo

‘తెనాలిని గంజాయికి అడ్డాగా మార్చేశారు’

ఆంధ్రా ప్యారిస్‌ను ఇక్కడి సిటింగ్‌ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ఆరోపించారు.

Published : 24 Apr 2024 06:50 IST


మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే : ఆంధ్రా ప్యారిస్‌ను ఇక్కడి సిటింగ్‌ వైకాపా ఎమ్మెల్యే గంజాయి అడ్డాగా మార్చారని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ఆరోపించారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. షర్మిల మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ఉద్దేశించి యథేచ్చగా ఇసుక దోపిడీ చేస్తోంది నిజమేనా అని ప్రశ్నించడంతో జనం ఔనంటూ తమ చేతులు ఊపారు. మరోసారి ఆయన్ను గెలిపిస్తే ఏకంగా తెనాలిని కూడా అమ్మేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఇసుక దోపిడీకి పాల్పడగా వచ్చిన డబ్బును మీ ఓట్ల కొనుగోలుకు వినియోగిస్తారని హెచ్చరించారు. పంచితే తీసుకోమని ఆమె సూచించారు. ఇవి జీవితాలను మార్చే ఎన్నికలని.. ఆలోచించి ఓటేయకుంటే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదని షర్మిల పేర్కొన్నారు. జగన్‌ పెడుతున్న సిద్ధం సభలు దేనికంటూ ప్రశ్నించారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ భాజపాకు మరోసారి అధికారమిస్తే రాజ్యాంగం ఉండదని మనువాద రాజ్యాంగం వస్తుందని హెచ్చరించారు. తెనాలి నియోజకవర్గ అభ్యర్థి షేక్‌ బషీద్‌ మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి అజయ్‌కుమార్‌ను, తనను గెలిపించాలన్నారు. కాంగ్రెస్‌ జిల్లా నాయకులు లింగశెట్టి ఈశ్వరరావు, తెనాలి సీపీఎం నాయకులు బాబూప్రసాద్‌, శివసాంబిరెడ్డి, షేక్‌ హుస్సేన్‌వలి మాట్లాడారు. కాగా పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల బస్టాండ్‌ సమీపంలోని లాడ్జి వద్ద తన వాహనంలోనే బస చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు